calender_icon.png 24 November, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

24-11-2025 05:24:04 PM

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్..

హనుమకొండ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రిజర్వేషన్ ప్రక్రియ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డా.కూరపాటి రమేష్ అన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు కామారెడ్డిలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని డిక్లరేషన్ ప్రకటించి, అధికారములో కొచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీల్లో, మండలిలో రెండు వేర్వేరుగా విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను ఆమోదించి గవర్నరకు పంపగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.

ఈలోపు ఆర్టినెన్స్ విడుదల చేసి తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టి వేశాయని, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హడావుడిగా జీవో నం.46 తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో పాత రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి పూనుకుంటుందన్నారు. దీన్ని 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఎన్నికలను వాయిదా వేసి కేంద్రంపై బత్తిడి పెంచి, వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లులను పెట్టి ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని, బిజెపి అందుకు సహకరించి, బిఆర్ఎస్ కలిసి రావాలన్నారు. కాంగ్రెస్ చొరవ తీసుకొని అందరినీ కలుపు పోని వెళ్ళి పార్లమెంట్ లో బిల్లు పెట్టేదాకా పోరాటం చేసి సాధించుకొని రావాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మండల పరశురాములు, అసిస్టెంట్ ప్రొఫెసర్. డాక్టర్ వీరస్వామి, వీరస్వామి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు డాకర్ చందా మల్లయ్య, మేకల సుమన్, తెలంగాణ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.