26-11-2025 10:09:00 PM
డీఎస్పీ రెహమాన్
సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాలి...
1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిఎస్పీ రెహమాన్
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ బుధవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది యొక్క ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను డిఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్ 100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్సైలు రాకేష్, విజయ కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.