26-11-2025 10:06:38 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం వావిలాలపల్లిలోని శక్తి సోలార్ ఏక వేణి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయంలో బుధవారం రోజున నక్క ప్రత్యక్షమైంది. కంపెనీ కరీంనగర్ నిర్వాహకులు కటకం సునీల్ రావు ఉదయం కార్యాలయ భవనానికి వెళ్లిన సందర్భంలో అక్కడే ఉన్న పూల కుండీల వద్ద నక్క కనిపించింది. దీంతో వెంటనే సునీల్ రావు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నక్కను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు భారీ ఎత్తున తరలి రావడంతో ఆ నక్క అక్కడినుండి తప్పించుకుపోవడానికి పరుగులు పెట్టింది. అటవీ అధికారులు ఆ నక్క కోసం వెతుకులాట ప్రారంభించారు.