3 April, 2026 | 3:43 PM

Breaking News

రాష్ట్రంలో మూడు రోజులు మోస్తరు వర్షాలు   •   సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   'మార్పురావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి'— మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •  

ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ..

30-11-2025 09:30 PM

నారికేళ స్వామి చెన్నారెడ్డినీ సన్మానించిన మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్..

పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దోడగుంటపల్లి గ్రామానికి చెందిన నారికేళ స్వామి చెన్నారెడ్డి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమములో మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని చెన్నారెడ్డి స్వామిని సన్మానించారు. ఈ పూజ కార్యక్రమం గురుస్వాములు గోవిందరెడ్డి, ముత్తు కృష్ణ కరకమలములచే అత్యంత దేదీప్యమానంగా జరిగింది. గణపతిహోమం, పల్లకిసేవ, కుంకుమార్చన అభిషేకం అష్టోత్తరం మహపడిపూజ జరిగాయి.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ 18 సార్లు మాలవేసుకొని శబరిమల యాత్ర చేయడం పూర్వజన్మసు కృతమని అన్నారు. అయ్యప్ప దీక్షలతో మానసిక ప్రశాంతత,ప్రజలలో భక్తి ప్రభత్తులు, ఐకమత్యం పెంపొందుతాయి అని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గురుస్వాములు రఘుమారెడ్డి కృష్ణసాగర్ నరేందర్ అశోక్ రెడ్డి గట్టు శశి  పాపిరెడ్డి అనిల్  రాకాసి శ్రీనివాస్ రెడ్డి మేఘాశ్యం రెడ్డి రామకృష్ణ గ్రామస్థులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.