3 April, 2026 | 1:47 PM

Breaking News

రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •   కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్   •   Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ   •   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట   •  

మహమ్మదాపూర్ లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

30-11-2025 09:42 PM

-ప్రశాంత ఎన్నికల నిర్వహణకు భరోసా

హుస్నాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలకు పూర్తి భరోసా కల్పించే ఉద్దేశంతో, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఆదివారం ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో ఆదివారం హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, ప్రజలు ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా పోలింగ్‌లో పాల్గొనేలా విశ్వాసం కల్పించడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశమని ఏసీపీ అన్నారు. ప్రజలు నిర్భయంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్‌లో పాల్గొనాలన్నారు. "ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు పూర్తి సన్నద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎలాంటి భయాలకు గురికావాల్సిన అవసరం లేదు." అని అన్నారు.

* ర్యాలీలు, సభలకు అనుమతి తప్పనిసరి : సీఐ శ్రీనివాస్

హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడవద్దన్నారు. ర్యాలీలు,  బహిరంగ సభలు నిర్వహించాలంటే తప్పనిసరిగా తహసీల్దార్, పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించినట్టయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్ : ఎస్సై లక్ష్మారెడ్డి

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులు, అనుమానాలు ఉన్నా తక్షణమే 8712667352 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు. "అల్లర్లు సృష్టించాలని చూసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం," అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోహెడ ఎస్సై అభిలాష్, ఏఎస్సై మణెమ్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.