27-12-2025 03:29:44 PM
పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్పలు
అన్నదానం చేసిన గట్టు శశాంక్, శ్రీలత దంపతులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. గట్టు కృష్ణమూర్తి శోభారాణి దంపతుల కుమారుడు కోడలు గట్టు శశాంక్ శ్రీ లత దంపతులు అయ్యప్ప స్వామి పడిపూజ ఏర్పాటు చేయడంతో పాటు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పడిపూజ వేడుకల్లో భాగంగా అయ్యప్ప స్వాముల పాటలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు అండ్ చైర్మన్ సాయిరి పద్మ మహేందర్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన గట్టు శశాంక్ శ్రీలత దంపతులు వారి కుమార్తె శ్రీ తన్వి లకు స్వామివారి శేష వస్త్రం అందజేసి అ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తబృందం పాల్గొన్నారు.