calender_icon.png 27 December, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్ వేడుకలో మద్యం తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవు

27-12-2025 03:34:19 PM

ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్

ఉప్పల్,(విజయక్రాంతి): న్యూ ఇయర్ వేడుకల్లో అధికంగా మద్యం సేవించి వాహనం నడిపితే ఉపేక్షించలేదని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ కూడా హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. మద్యం  సేవించి వాహనం నడిపి మీ అమూల్యమైన ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. పోలీసులు శిక్షించేది కాదు రక్షించే అందుకే  ఆంక్షలు పెట్టామని నియమాలు పాటిస్తే న్యూ ఇయర్ ఆనందంగా గడుస్తుందని ఆయన తెలిపారు.

నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలని ఆయన సూచించారు. సీట్ బెల్ట్ వాహనదారులు హెల్మెట్లు ను ధరించాలన్నారు. గుంపులు గుంపులుగా నిలబడి  ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. డీజేలు మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టి పక్కవారిని ఇబ్బంది పెట్టొద్దని  ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి వహించాలని డ్రగ్స్ గంజాయి మారక ద్రవ్యాలు  వినియోగిస్తే చర్యలు తప్పవు అన్నారు.

యువత మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో  వాటి అరికట్టందుకే నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో  పలుచోట్ల ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని ఈ ప్రత్యేక డ్రైవ్ లో  ద్విచక్ర వాహనాలు కార్లు భారీ వాహనాలు కూడా తనిఖీ నిర్వహించబడతాయని బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు చేసి నిబంధనలు ఉల్లగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.  న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరైనా ఇబ్బందులు గురిచేస్తే  వందకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అందరూ సురక్షితగా న్యూ ఇయర్ జరుపుకోవాలని ఆయన సూచించారు.