27-12-2025 03:26:10 PM
మంథని,(విజయక్రాంతి): రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామడుగు మారుతి అందరికీ ఆదర్శప్రాయుడని జూనియర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ శ్రీరంభట్ల అంబరీష్ అన్నారు. పెన్షనర్ల సంఘం జిల్లా సహ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మారుతీని శనివారం ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అంబరీష్ మాట్లాడుతూ... రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించడంలో మారుతి ఎంతో ఓపికతో ముందుంటున్నాడని కొనియాడారు. జిల్లా పెన్సిన్నర్స్ సంఘం అధ్యక్షుడు ఎ నర్సింగరావు, రగొత్తoరెడ్డి, కొండెల మారుతి, రంగి నగేష్, కొల్లారపు శ్రీనివాస్, అవధాని మోహన్ శర్మ, మహావాది సతీష్ కుమార్, న్యాయవాది లోకే రాధాకిషన్ రావు, గట్టు నందు,, శశిభూషణ్ కాచే, మేడగోని రాజమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.