అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ప్రారంభం
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్ , నవంబర్ 24 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో నూతనంగా నిర్మిం చిన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా... కన్నుల పండుగగా ప్రారంభమ య్యాయి... ఈ సందర్భం గో మాత పూజ... గణేష్ పూజ... హోమాలతో పాటు పలు పూ జా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించా రు.
అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్టు వ్యవస్థాపకులు , చైర్మన్ సాయిరి పద్మ మ హేందర్ దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుక లు ఘనంగా ప్రారంభమయ్యాయి... ఈ కా ర్యక్రమం లో ట్రస్ట్ గౌరవాధ్యక్షులు, గురుస్వామి మిట్టపల్లి మురళీధర్ , యంత్ర ప్రతి ష్టాపకులు , ఆధర్పణ వేద పండితులు ఉ ప్పర మల్యాల లక్ష్మణ శర్మ , ఆలయ పురోహితులు గూడ రమేష్ శర్మ , అభయ ఆం జనేయ స్వామి దేవాలయం చైర్మన్ మారవేణి లచ్చయ్య , ఆలయ చీఫ్ అడ్వైజర్ కం దుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), ముత్యాల రవీందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యు లు , భక్త బృందం పెద్ద ఎత్తునపాల్గొన్నారు.






