07-07-2025 01:45:32 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ క్రైం, జూలై 6 (విజయక్రాంతి): దళితుల అభ్యున్నతికి నిరం తరం కృషి చేసిన మహానుభావుడు బాబు జగ్జీ వన్ రామ్ అని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విగ్రహానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా వివిధ శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తించడమే కాకుండా 30 సంవత్సరాలుగా కేబినెట్లో వివిధ పదవులు నిర్వహించి రికార్డు నెలకొల్పిన వ్యక్తి అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమాలలో ఆరేపల్లి మోహన్, వెన్న రాజ మల్లయ్య, కొర్వి అరుణ్ కుమార్, బానోతు శ్రావణ్ నాయక్, బొబ్బిలి విక్టర్, కల్వల రాంచందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దండి రవీందర్, పోరండ్ల రమేష్, అబ్దుల్ భారీ, నెల్లి నరేష్, మాదాసు శ్రీనివాస్, మంద మహేష్, బషీర్ ఉద్దీన్, గాలి అనిల్ కుమార్, మాదాసు శ్రీనివాస్, దుబ్బ నీరజ, తదితరులుపాల్గొన్నారు.