calender_icon.png 7 July, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ శ్రేయస్సు కోసం సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించాలి

07-07-2025 01:44:08 AM

మంథని, జూలై6(విజయక్రాంతి): యువకులు సమాజ శ్రేయ స్సు కోసం ముందుకు వచ్చి సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్ పటేల్ రచన దర్శకత్వం, నిర్మాణంలో ’రక్షణ’అనే లఘు చిత్రాన్ని ఆదివారం ఏసిపి రమేష్ క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో మంచి మార్పు తీసుకోని వచ్చే విధంగా షార్ట్ ఫిల్మ్ లను నిర్మించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి ’విప్లవం’, ’రౌడీయిజం’ ’చదువు’ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని సమాజంలో రావాల్సిన మార్పు కోసం తీస్తున్న ఈ చిత్రం నలుగురికి ఉపయోగ పడేవిధంగా ఉండాలన్నారు. సమాజంలో కొంతైనా మార్పు వస్తుందని ఏసీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రక్షణ లఘు చిత్రంలో హీరో గా సంటి రమాకాంత్, దామర రాజేష్, వనపర్తి ప్రభాస్, స్వరూప రాణి, నిక్కత్, నిర్మల, రాజేశ్వరి, చైతన్య రాణి, జక్కుల స్వప్న, సిరిశెట్టి తిరుపతి గౌడ్, తదితర నటి నటీమణులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు దామర శంకర్, దయానంద్ గాంధీ, మ్యాజిక్ రాజా, చంద్రపాల్, కొమ్ము కుమార్ యాదవ్, మేకల శ్రీకాంత్, పి ఎన్ పటేల్, ఉపేందర్, విజయ్ కుమార్, వంగ శ్రీనివాస్ గౌడ్, నాగభూషణం గౌడ్, డాక్టర్ శంకర్ లింగం, కళావతి ,మధు తదితరులు పాల్గొన్నారు.