calender_icon.png 7 July, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

07-07-2025 01:45:33 AM

- విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే గేదెల మృతికి కారణమని ఆరోపణ

- రైతును ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

తలకొండపల్లి, జూలై 6:పశు గ్రాసం మేస్తూ పొలంలో వెళుతున్న పాడి గేదలు తెగిపడిన విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుద్ఘాతానికీ గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం తలకొండపల్లి మండలం రామకృష్ణాపురంలో చోటుచేసుకుంది. భా దిత రైతు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు సింగిరెడ్డి ఎలమందారెడ్డికి చెందిన రెండు పాడి గేదెలు పొలం లో మేతకు వెళ్లాయి.అదేసమయంలో పొలం పై నుండి వెళుతున్న విద్యుత్ తీగలు తెగి పొలంలో పడ్డాయి. మేతకు వెళ్లిన గేదెలు తెగిపడ్డ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడే మృత్యువాత పడ్డాయి.

మృతి చెందిన గేదెలను ఏడాది క్రితం రూ.2.35 లక్షలకు కొనుగోలు చేసినట్లు రైతు చెప్పారు.విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు పాడి గేదెలు మృతి చెందినట్లు ఎలమందారెడ్డి ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతు విజ్ఞప్తిచేస్తున్నారు.