07-07-2025 12:24:07 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అనే గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ దళిత మోర్చ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఆదివారం కార్పొరేటర్ కార్యాలయం వద్ద నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ భారత రాజకీయ వ్యవస్థ లో అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. పేద వారి కోసం పాటుపడిన మహా నేత అని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి. నవీన కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, రాజు, పి. నర్సింగ్ రావు, శివ కుమార్ శ్రీనివాస్, ప్రకాష్ యాదవ్, ఆనంద్ రావు, దళిత మోర్చ నాయకులు సత్యేంధర్, నర్సింహ, సాయి కుమార్, చర్ర యాదగిరి, రాజేందర్, సుక్క యాదగిరి, రహమత్ ఆలి, సంధ్యా రాణి, పూర్ణ, సం యుక్త రాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.