calender_icon.png 7 July, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ ఆశయాలను కొనసాగించాలి

07-07-2025 12:23:00 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

హనుమకొండ, జూలై 6 (విజయక్రాంతి): దివంగత మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ ఆశయాలను కొనసాగించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రణయ్ మిత్రమండలి, ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దివంగత మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి, వర్థంతిలను ఘనంగా నిర్వహించారు.

హనుమకొండ వడ్డెపల్లిలోని ప్రణంయ్ భాస్కర్ నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర నేత, 60వ డవిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ తదితరులు ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి పుష్పాంజలిఘటించారు. తొలుత వడ్డెపల్లి ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి ప్రణయ్ భాస్కర్ సతీమణి దాస్యం సబిత భాస్కర్, కూతురు అపూర్వ భాస్కర్, అల్లుడు రంజిత్ తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

వడ్డెపల్లి రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి వడ్డెపల్లిలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ శ్రేణులు నాగపురి అశోక్, గుండె అశోక్, రోకుల సతీష్, మట్టెపల్లి రాంరాజ్, యాదగిరి, జనగాం వెంకటేశ్వర్లు, కేశబోయిన కోటేశ్వర్రావు, కేశబోయిన విపుల్ తదితరులు పాల్గొన్నారు.