calender_icon.png 13 September, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావిలో పసికందు మృతదేహం

16-12-2024 01:32:05 AM

జగిత్యాల, డిసెంబర్ 15 (విజయక్రాంతి): పేగు బంధాన్ని మరచి, పసికందును బావిలో పడేసిన అమానవీయ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో ఆదివారం పసికందు(బాబు) మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.