16-12-2024 01:30:50 AM
మరమ్మతులను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15(విజయక్రాంతి): రెడ్‌హిల్స్‌లో ధ్వంసమై న మెయిన్ పైప్‌లైన్ పనులను జలమండలి అధికారులు యుద్ధప్రాతిపదకన పూర్తి చేశా రు. నీటి సరఫరా పునరుద్ధరణ కోసం ఆదివారం జరిగిన పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడైన పైపులను అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించారు. పైప్‌లైన్ విస్తరణ పనులు పూర్తున వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నీటి సరఫరా, మురుగునీటి నెట్‌వర్క్ కోసం పైప్‌లైన్‌ల వివరాలను జీఐఎస్ నమోదు చేయాలని ప్రాజెక్ట్ అధికా రులను ఆదేశించారు.