calender_icon.png 13 September, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరి గ్రామాల్లో వైద్య శిబిరం

13-09-2025 02:58:36 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని శాఖనగొంది, మాలన్ గొంది గిరిజన గ్రామాలలో శనివారం డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మంత్రులను అందజేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి డ్రై డే కార్యక్రమం నిర్వహించడంతో పాటు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతకు తీసుకోవలసిన చర్యలపై వివరించారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ లు సరిత,ఉత్తం,ఎం ఎల్ హెచ్ పి సమత, ఏ ఎన్ ఎం శంకరమ్మ, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.