06-08-2025 08:05:53 PM
మహబూబ్ నగర్ టౌన్: స్థానిక ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాల(NTR Women's Degree and PG Autonomous College)లోని జంతు శాస్త్రం, రసాయన శాస్త్రం, తెలుగు సబ్జెక్టులకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రథమ సంవత్సర విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడుకోలు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, పీజీ అనంతరం పోటీ పరీక్షలలో భాగంగా సెట్, నెట్, రీసెర్చ్ ఇనిస్ట్యూట్స్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి సైంటిస్టులుగా కూడా రాణించవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ, నూతన టెక్నాలజీని విద్యార్థులు అవగాహన చేసుకుంటూ ఉండాలని నిర్మాణ రంగంలో విప్లమాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, మార్పులకు అనుగుణంగా అనేక ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని స్కిల్ ఉంటే చాలు ఉపాధి సంపాదించవచ్చు అంటూ మాట్లాడారు.
అనంతరం సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరిగింది. చివరగా జూనియర్లు సీనియర్లు చేసిన నృత్యాలు ఆద్యాంతం వినోదాత్మకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కోఆర్డినేటర్ అనిత , జంతుశాస్త్ర విభాగ ఇన్చార్జ్ డాక్టర్ ఎం ప్రవీణ్ కుమార్, తెలుగు విభాగాధిపతి డాక్టర్. లక్ష్మీనరసింహారావు, శ్రీలత, అది బాతాజ్, డాక్టర్.సి.హెచ్. శివప్రసాద్, ఎం. వెంకటరమణమూర్తి పాల్గొన్నారు.