06-08-2025 07:57:42 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో వికలాంగుల అనుబంధ సంఘం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ దుమ్ము వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈనెల 13న హైదరాబాదులో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే వికలాంగుల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.
వికలాంగులకు రూ. 6000 లు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, గౌడ అన్నలకు రూ. 4 000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వికలాంగుల సమస్యలను పరిష్కరించుట కు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా ఇన్చార్జి రుద్రారపు రామచంద్రం, జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్, వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి కన్యబోయిన కొమురక్క, అంజలి ఎమ్మార్పీఎస్ యూత్ అధ్యక్షులు మంతిని రవితేజ, చింతకుంట సదానందం, ప్రధాన కార్యదర్శి లింగాల సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.