06-08-2025 07:37:15 PM
బోథ్ (విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గంలోని బజార్హత్నూర్, నేరడిగొండ మండల కేంద్రాలలో సబ్ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని వాటి కొరకు స్థల సేకరణ చేపట్టాలని బోథ్ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతి(RDO Sravanthi)ని కలిసి వినతిపత్రం అందించారు. సబ్ మార్కెట్ యార్డులతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. దూర భారంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా మిగులుతాయని రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సబ్ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.