06-08-2025 07:55:42 PM
భూత్పూర్: తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో అధికారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి తహసిల్దార్ కిషన్ నాయక్(Tehsildar Kishan Naik) పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉద్యమాలు నడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జయశంకర్ ఆశయాలను కొనసాగించుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ గీత, ఆర్ ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.