calender_icon.png 6 August, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్

06-08-2025 07:43:03 PM

మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా పార్కులోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్(State Legislative Council Deputy Chairman Banda Prakash), హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రొఫెసర్ గా ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ తహశీల్దార్ రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.