06-08-2025 07:47:39 PM
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధార్థ కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో జయశంకర్ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు(Municipal Commissioner Thungapindi Rajalingu) పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ టి రాజేశ్వరి, రెవెన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్లు బి శ్రీనివాస్, డి మహేష్, జూనియర్ అకౌంటెంట్లు వెంకటేష్, శ్రీకర్, జూనియర్ అసిస్టెంట్ పూర్ణచందర్, పబ్లిక్ హెల్త్ వర్కర్ సిహెచ్ రాజశేఖర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం గోపికృష్ణ, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బి శ్యాంబాబు, హెల్త్ అసిస్టెంట్ ఎంఏ సమీర్, ఇన్చార్జి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ రఘురాం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సింగరేణి ఆధ్వర్యంలో...
ఏరియా జిఎం కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిఎం జి దేవేందర్ మాట్లాడుతూ జయశంకర్ ప్రొఫెసర్ గా పని చేసి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని కోరుకున్న వ్యక్తులలో ప్రధముడని, తెలంగాణ రాష్ట్ర సాధనలో దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయ శంకర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచి సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షులు రమేష్, సీనియర్ పీఓ శంకర్, కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.