calender_icon.png 6 August, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం

06-08-2025 07:50:28 PM

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

కామారెడ్డి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడవ సిపిఐ జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి భారీగా ర్యాలీగా పోలీస్ స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, మీదుగా  మున్నూరు కాపు సంఘం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పైన నిరంతరం ఉద్యమములు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలను అరికట్టాలని అన్నారు.

ప్రశ్నించే గొంతులను మావోయిస్టులను, అర్బన్ నక్సలైట్లను, దేశ పౌరులను చంపే హక్కు ఎవరిచ్చారని ఆయన అన్నారు. నిరుపేదలకు ఉపయోగపడే చట్టాలు లేక అంబానీ, ఆదానిలకు ఉపయోగపడుతు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. హిందుత్వంతో పేరుతో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో 90% నిరుపేదలు ఉన్న 10 శాతం ధనిక వర్గం కార్పొరేట్ శక్తులకు బిజెపి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మూడు పూటలు తినడానికి ఇబ్బంది ఉన్న నిరుపేద ప్రజల కోసం నిరుపేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను 11 సంవత్సరాలు దాటుతున్న అమలు చేయలేదన్నారు. దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని ఇప్పటికీ బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. మతం పేరుతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను  ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రైతుబంధు, పెన్షన్లు, రైతు బీమా, రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. పార్టీలకతీతంగా అందరికీ అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.

పెరిగిన ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని, సిఫార్సు ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. రైతు చట్టాలను అమలు చేయాలని రైతులకు నాణ్యమైన ఎరువులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకురాలు పశ  పద్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమన్న, సిపిఐ సీనియర్ నాయకులు వి,ఎల్ నరసింహ రెడ్డి, సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి. ఎల్ దశరథ్, సిపిఐ జిల్లా నాయకులు పి బాలరాజ్, దుబాస్ రాములు, దేవయ్య, ఈశ్వర్, నాగమణి, మల్లేష్, రాజమణి, గంగాధర్, రాజిరెడ్డి, హైదర్, బాలరాజు, శివప్రసాద్, ప్రవీణ్, విమల, ఎల్ సంపత్, నరేష్ ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.