06-08-2025 08:03:56 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణ చెరువు కట్టపైన ఓపెన్ జిమ్ కి పది లక్షలు, చెరువులో బతుకమ్మలు వేయడానికి బతుకమ్మ ఘాట్ ఏర్పాటుకు 30 లక్షలు, తోక బొంద స్మశాన వాటిక, ఎరుకల వడ స్మశాన వాటికకు కోటి రూపాయలు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు, సహకారం అందించిన పొన్నం సత్యనారాయణ గౌడ్ కు కొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. వీటి ఏర్పాటుకు మున్సిపల్, ఏఈ అధికారులకు పరిశీలించండం జరిగింది. అధికారులతో పాటు కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్, జేరిపోతుల వాసు, గున్నాల రమేష్, పొన్నం శ్రీనివాస్, రాపర్తి రాజు, పుల్ల రాజు ఉన్నారు.