calender_icon.png 6 August, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యాసం అభివృద్ధికి మార్గం

04-08-2025 12:00:00 AM

  1. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్

ఘనంగా వర్శిటీ స్నాతకోత్సవం

956 మంది విద్యార్థులకు డిగ్రీలు, 21 మందికి బంగారు పతకాలు ప్రదానం

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ’అభ్యాసం’ అభివృద్ధికి మార్గమని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రపంచంలో ఎదుగుదలకు, ప్రభావం చూపడా నికి నేర్చుకోవడం అత్యంత అవసరమన్నారు. మహీంద్రా యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం బహుదూర్పల్లి క్యాంపస్లో  ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో కలలు, ఆశలతో ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో ఇతరులతో కలసి పని చేయడం, నేర్చుకోవడం చేయాలన్నారు. అవరోధాలు తొలగించే సముదా యాలను, కార్యాలయాలను నిర్మించాలన్నారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాల న్నారు. ఒకే దిశగా వలస వెళ్లే పక్షుల్లా కలిసి నేర్చుకొని ఎదగాలన్నారు.

స్వీయ నమ్మకాలను జయించగల సామర్థ్యం ఉందన్న విశ్వా సం ఉండాలన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మనల్ని మనలా మారుస్తాయన్నారు. ఈ సందర్భంగా మహీంద్రా యూని వర్శిటీ ఛాన్సలర్ ఆనంద్ మహీంద్రా మా ట్లాడుతూ  ఉజ్వల భవిష్యత్తు రూప శిల్పులే తమ లక్ష్యమని తెలిపారు. మెరుగైన ప్రపంచ నిర్మాణం వైపు అడుగులు వేయాలన్నారు. కరుణ, విమర్శనాత్మక ఆలోచన, నైతికత వంటి విలువలు అలవర్చుకోవాలన్నారు.

విశ్వాసం, ఆచరణ అనేవి ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలన్నారు. విద్యార్థులు విలువలకు కట్టుబడి జీవించాలని కోరారు. సుస్థిరత, సమ్మిళితత్వం, న్యాయం వంటి వాటిపై ఆధారపడిన ప్రపంచాన్ని నిర్మించాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా మహీంద్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ యాజులూ మేదురి మాట్లాడుతూ భవిష్యత్తు విద్య దూరదృష్టి కలిగిన మనస్సుల చేత నిర్వచించబడుతుందన్నారు.

వీళ్లు సంప్రదాయాలను సవాల్ చేయగలగాలన్నారు. మా విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా, సరికొత్త ప్రపంచ నిర్మాణానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరం ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), ఎల్‌ఎల్బీ (బాచిలర్ ఆఫ్ లా), ఎంఏ (మాస్టర్ ఆఫ్ ఆరట్స్), బీటెక్ నానో టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఇది తొలి స్నాతకోత్సవం అన్నారు.

ఈ సందర్భంగా మహీంద్రా యూ నివర్సిటీ బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యుడు, టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ మోహిత్ జోషి మాట్లాడుతూ విభాగాల మధ్య అనుసంధానం చేసే వాళ్లు, వ్యవస్థలను ప్రశ్నించే వాళ్లు, ఆవిష్కరణలు చేసే వాళ్ల అవసరం అధికంగా ఉందన్నారు. ఈ స్నాతకోత్సవంలో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, లా, ఎడ్యుకేషన్ స్కూల్స్కి చెందిన 943 మంది విద్యార్థులకు, 13 మంది పీహెచ్డీ స్కాలర్లకు డిగ్రీలు ప్రదానం చేశారు.

21 మందికి బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ ల్యాబ్‌ను జీవీ ప్రసాద్, ఆనంద్ మహీంద్రా ప్రారంభించారు. సెంటర్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్ను ఆనంద్ మహీంద్రా ప్రారంభించారు. ఈ స్నాతకోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, అతిథులు హాజరయ్యారు.