calender_icon.png 6 August, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం గోదాంలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

06-08-2025 08:09:53 PM

వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోదాంలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెలవారి సాధారణ తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ ఈవీఎం గోదాములను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎం గోదాంల వద్ద పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ అంశాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం గోదాంలకు వేసి ఉన్న సీల్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.