18 April, 2026 | 11:44 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పొన్నారం లో బడిబాట

06-06-2025 05:26 PM

మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామం(Ponnaram Village)లో బడిబాట కార్యక్రమంలో భాగంగా నూతన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం(Badibata Program)లో ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు గ్రామస్థులకు వివరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి దత్తుమూర్తి(Mandal Education Officer Dattu Murthy) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.

పాఠ్యపుస్తకాలతో పాటు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తుందన్నారు. అన్ని రకాల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తుందని, గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు పి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి హరీష్, అంగన్వాడీ టీచర్ సునీత,ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.