09-02-2025 07:27:52 PM
ఇల్లెందు (విజయక్రాంతి): కొత్తగూడెంలో భూ పోరాటం చేసి 20 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇప్పించిన మహనీయుడు కాసాని ఐలయ్యకు విప్లవ జోహార్లు అర్పించిన భూ పోరాట కేంద్రం గుడిసె వాసులుస్థానిక దేవులపల్లి యాకయ్యనగర్ భూ పోరాట కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర సీనియర్ నేత అమరజీవి కాసాని ఐలయ్య సంతాప సభ నిర్వహించారు. మన్యం మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ... పాపకొల్లు నుంచి పాల్వంచ వరకు 20 వేల మంది ఇళ్ళు లేని నిరుపేదలకు భూ పోరాటాల ద్వారా ఇళ్ల స్థలాలు ఇప్పించిన మహనీయుడు కాసాని ఐలయ్య అని అన్నారు.
వ్యవసాయ కూలీలంటే ఆయనకు అమితమైన ప్రేమ అన్నారు. కాసాని మరణం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీరని లోటు అని అన్నారు. తుది శ్వాస వరకు ప్రజా ఉద్యమాలు చేశారని వారి మరణం వామ పక్ష ఉద్యమానికి పూడ్చలేని లోటు అన్నారు.తను తన మరణాంతరం తన భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థులకు పరిశోధనల కోసం మెడికల్ కళాశాల కు దానం చేయడం అసాధారణ విషయం అన్నారు.పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంతాప సభలో భూ పోరాట కేంద్రం ప్రజలు నివాళులర్పించారు.