calender_icon.png 22 November, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్య నమస్కారాల పోటీలలో పలువురి ప్రతిభ

09-02-2025 07:30:15 PM

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ లో స్థానం... 

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ సొసైటీ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శతస హస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన, రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీలలో పట్టణానికి చెందిన పలువురు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ లో స్థానం సంపాదించారు. ఈ పోటీలలో పట్టణానికి చెందిన 25 సంవత్సరాలపై కేటగిరిలో అయిష్ యోగా ఇన్స్పెక్టర్ గోదారి రామ్మోహన్, 333  రౌండ్స్, దుర్గం రజిత 157 రౌండ్స్, 25 సంవత్సరాలలోపు కేటగిరీలో మదర్ థెరిస్సా స్కూల్ విద్యార్థిని గోదారి అద్వైత 110 రౌండ్స్ సూర్య నమస్కారాలు ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇంటర్నేషనల్ లో స్థానం సంపాదించారు. వీరిని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు.