09-02-2025 07:25:51 PM
భైంసా (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సిరిపల్లి చెక్పోస్ట్ వద్ద ఆదివారం ఒక్క లక్ష యాభై మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై రవీందర్ తెలిపారు. గైక్వాడ్ శంకర్ ఇలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తరలిస్తుండడంతో పట్టుకొని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎన్నికల్లో కోడ్ లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.