calender_icon.png 25 October, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదకరంగా బైరాపూర్ బ్రిడ్జి

25-10-2025 12:00:00 AM

వెల్దండ అక్టోబర్ 24 : వెల్దండ మండల కేంద్రం నుంచి శిరసనగండ్లకు వెళ్లే ప్రధాన రోడ్డు బైరాపూర్ వాగుపై నిర్మించిన బ్రిడ్జి మూడు సంవత్సరాల క్రితం వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పట్లో అధికారులు అప్పటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో 3 లక్షల రూపాయలు వెచ్చించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. శాశ్వత మరమ్మతులకు మాత్రం నిధులు మంజూరు కాకపోవడం పూర్తిస్థాయి నిర్మా ణం చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు మరింత దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో వెళ్లాలంటే వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది. వర్షాలు అధికంగా కురిస్తే తాత్కాలిక బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారనుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి కూలిపోతే వెల్దండ మండల కేంద్రం నుంచి చారగొండ, సిరసనగండ్ల, దేవరకొండ వెళ్లడానికి మండల పరిధిలోని వైరాపూర్, హజిలాపూర్, చంద్రాయన్ పల్లి, అంకిరెడ్డిపల్లి, కుందారం తండా, లాల్ తండా, తూర్పు తండ., అప్పారెడ్డిపల్లి ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలుకోరుతున్నారు.