calender_icon.png 25 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలి

24-10-2025 11:46:12 PM

గణితంపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు మంజూరి పత్రాలు అందుకుని ఇంకా ప్రారంభించని వారు త్వరగా ప్రారంభించి, నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండల పరిధిలోని చందాపూర్, చిట్యాల గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు మంజూరి పత్రాలు అందుకుని ఇంకా ప్రారంభించని వారు త్వరగా ప్రారంభించి, నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి దశల వారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. గ్రౌండింగ్ ప్రారంభించిన ఇళ్లు బెస్‌మెట్‌ లెవల్‌కు చేరితే మొదటి విడత చెల్లింపులు జరుగుతుందని అన్నారు. ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోందని, పనులను నాణ్యవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు పర్యవేక్షణను క్రమం తప్పకుండా కొనసాగించాలని కలెక్టర్ అన్నారు.  పెండింగ్ లేకుండా లబ్ధిదారులకు నగదు పడే విధంగా చూసుకోవాలని, పెండింగ్ సమస్యలు ఏమైనా ఉంటే నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ఇసుకకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. 

గణితంపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి

చందాపూర్ గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల గణితం మార్కుల నివేదికతో పాటు ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ గురించి ఆరా తీశారు. గణితంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, గృహ నిర్మాణ శాఖ డి ఈ విఠోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.