04-06-2025 11:13:31 PM
పట్టణ సిఐ శివశంకర్..
కోదాడ: బక్రీద్ పర్వదినాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని కోదాడ సీఐ శివశంకర్(CI Shivashankar) అన్నారు. బుధవారం కోదాడలో బక్రీద్ సందర్భంగా ఏర్పాటుచేసిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగలు ఐక్యతకు ప్రతీకలని ఐకమత్యంతో పండుగలు జరుపుకోవాలని వివిధ పార్టీ నాయకులకు ముస్లిం పెద్దలకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో మత కల్లోలాలు సృష్టించే ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుధీర్ కుమార్, ముస్లిం మత పెద్దలు మౌలానా, అబ్దుల్ రషాది, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బషీర్, నూనె సులోచన, కృష్ణయ్య, షేక్ నయం, గంధం పాండు, కనగాల నారాయణ తదితరు ఉన్నారు.