20-12-2025 08:32:47 PM
చేగుంట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) చేగుంట మండల నూతన కమిటీని మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి.నగేష్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీఅధ్యక్షులు వి.బాలపోచయ్యఉపాధ్యక్షులు కె.మెహన్. గిరిజ,ప్రధాన కార్యదర్శి: డి. మణిరామ్,కోశాధికారి : వి. శ్రీనివాస్ కార్యదర్శి గా రవిబాబు వి.సురేష్ ఎన్నికయ్యారు,అనంతరం టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ టెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడనాడాలని ,రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని ,డి ఏ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.