20-12-2025 08:28:57 PM
వెల్దండ: మండల పరిధిలోని అజిలాపూర్ గ్రామ సర్పంచగా టిఆర్ఎస్ మద్దతుతో ఎన్నికైన సిద్ధగోని రమేష్ గౌడ్ ను శనివారం హైదరాబాదులో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోల్డ్ శ్రీనివాస్ రెడ్డి సన్మానించి అభినందించారు. గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సర్పంచికి, గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వాడు సభ్యుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు