20-12-2025 08:39:35 PM
హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ హనుమకొండ జిల్లా కార్యాలయ నూతన మీటింగ్ హాల్ ప్రారంభోత్సవము, 2026వ సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుందని నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ పెన్షనర్స్ డే ఉత్సవాలను 22వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియ పెన్షనర్స్ ఫెడరేషన్ చైర్మన్ పీ.కే.శర్మ, జనరల్ సెక్రెటరీ డి. సుధాకర్, పూర్వ చైర్మన్ ఎస్.ఎస్.దూబే, సెక్రటరీ జనరల్ జి.పూర్ణచందర్ రావు, ఎస్జీపీఏటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ. రాజేంద్ర బాబు, ఎం.వి. నర్సింగా రావు, సత్య దేవ్ సింగ్ అధ్యక్షులు ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్, అతిథులుగా ఏ.శ్రీనివాస్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ హనుమకొండ,టి. రాఘవరెడ్డి రీజినల్ ఆఫీసర్ ఆర్ అండ్ బి, కె. జనార్దన్ రెడ్డి రిటైర్డ్ సి.ఈ. ఆర్ అండ్ బి మరియు రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పెన్షనర్ల జాతీయ, రాష్ట్ర నాయకులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్నటువంటి పెన్షనర్ల సమస్యలను విపులంగా విశదీకరిస్తారనీ, రిటైర్డ్ అయిన పెన్షనర్లందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.