11 April, 2026 | 2:42 AM

యుద్ధవీర్ అవార్డు ప్రదానోత్సవం

01-05-2024 01:19 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శంకర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీదేవిప్రసాద్‌కు యుద్ధవీర్31 మెమోరియల్  అవార్డు వరించింది. మంగళవారం కింగ్‌కోఠిలోని విద్యాభవన్ ఆడిటోరియంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ అవార్డును ఆమెకు అందించారు. కాగా, 2000 సంవత్సరం నుంచి సుమారు 1200 మందికి ఆమె విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేశారు. కార్యక్రమంలో ట్రస్టీ చైర్‌పర్సన్ అమీర్ అలీఖాన్, రిటైర్డ్ ఐపీఎస్ అరుణ బహుగుణ పాల్గొన్నారు.