15-10-2025 12:34:24 AM
జిల్లా బీసీ జేఏసీ చేర్మెన్ పోతనకర్ లక్ష్మినారాయణ
నిజామాబాద్ అక్టోబర్ 14 (విజయక్రాంతి) : రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన బీసీ బంద్ ను విజయవంతం చేయాలని అన్ని బీసీ సంఘాలలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను పోతన్కర్ లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం నిజామాబాదు నగరంలోని గీత భవన్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పోతనకర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయకపోతే, బీసీలను మోసం చేసినట్లే అవుతుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బీసీ లను విభజించి, బలహీనపరచాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నయని నేను ఆరోపించారు.
బీసీలు ఈసారి పోవడానికి సిద్ధంగా లేరని తమ హక్కుల కోసం పోరాటనికి అయ్యారన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి బీసీ ఒక సైనికుడిలా ముందుకు రావాలని హక్కుల సాధన కోసం తలపెట్టిన బంధువులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.బీసీ లకు రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో సమాన హక్కులు లభించేవరకు బీసీల పోరాటం ఆగదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీ ల సంఖ్య ఆధారంగా చేసుకొని రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా చూసే రాజకీయాలను ఇక సహించే ది లేదన్నారు. బీసీ జేఏసీ ఈసారి ప్రజలతో కలిసి ఒక పెద్ద ఉద్యమానికి అన్నం సిద్ధం చేసిందని ఆయన తెలిపారు.
బంద్ విజయవంతం కావడానికి నిజామాబాదు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, ఆటో, క్యాబ్ యూనియన్లు, కార్మిక సంఘాలు తమ మద్దతు ప్రకటించాలనీ ఆయన కోరారు. బీసీ బంద్ అనేది కేవలం ఒక నిరసన కాదు ఇది బీసీల గౌరవం, హక్కు, హోదా కోసం ప్రారంభమైన మహా ఉద్యమం అని తెలిపారు.వైస్ చేర్మెన్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ నిజామాబాదు జిల్లాలో బీసీ బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు బీసీ ఒక్కటేతే మన సత్తా ఏంటో చూపెట్టాలి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు నిలిచి బందుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజ్ కో కన్వీనర్ మాస్టర్ శంకర్, అంబదాస్ రావు,బూరుగలా వినోద్, ఎనుగుందుల మురళి,నవతే ప్రతాప్, అమందు విజయ్ కృష్ణ,చింతకాయల రాజు, కస్తూరి కృష్ణ, బొట్టు వెంకటేష్, ఇందల్వాయి కిషన్ బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతనిధులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.యకులు బంద్ రోజున ప్రతి గ్రామం, పట్టణం, మండల స్థాయిలో బీసీ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, నిర్వహించనున్నట్లు తెలిపారు.