22-08-2025 12:30:10 AM
గజ్వేల్ విశ్వకర్మ మనుమయ సంఘం పిలుపు
గజ్వేల్, ఆగస్టు 21: తెలంగాణలోని కులవృత్తులను మరుగున పడేస్తున్న మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా శుక్రవారం బంద్ పాటించాలని గజ్వేల్ మనుమయ సంఘం అధ్యక్షుడు గడియారం వెంకటాచా రి అన్ని కుల వృత్తిదారులకు పిలుపునిచ్చా రు. మనమయ సంఘం భవనంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ మొత్తం వ్యాపారాలతో దోచుకుం టూ బలహీనవర్గాల వృత్తులను అణచివేస్తున్న మార్వాడీ వ్యాపారులు తెలంగాణ విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ప్రతి కులవృత్తిలో దూరి స్థానికుల జీవనోపాధిని మార్వాడీ వ్యాపారులు కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ జేఏసీ పిలుపు మేరకు గజ్వేల్‌లోనూ బంద్ పాటిం చి కులవృత్తిదారుల ఐక్యతకు మద్దతు తెలపాలన్నారు.