calender_icon.png 23 August, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులు కాదు.. వారు విశిష్ట ప్రతిభావంతులు

22-08-2025 12:30:57 AM

ఆర్మూర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి) : వైకల్యంతో బాధపడుతున్న వారిని దివ్యాంగులుగా  చూసి జాలి పడకుండా విశిష్ట ప్రతిభావంతులుగా గుర్తించి వారిని ప్రోత్సహించాలని సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్రావు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాన్ని గురువారం  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు.

కార్యాలయంలో రికార్డులను పరిశీలించి ఐఈఆర్పీలు కిషన్, సురేష్తో మాట్లాడారు. కేంద్రంలో వారానికి రెండు సారు ఉచితంగా అందిస్తున్న ఫిజియోథెరపీ సేవలను పరిశీలించి డాక్టర్ అరుణతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేసారు. అదేవిధంగా జిల్లాలో  ఈ నెల 23, 25, 26 తేదీల్లో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సమగ్ర శిక్ష, అలిమ్కో సంయుక్తంగా నిర్వహిస్తున్న.

దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణికి గుర్తింపు శిబిరానికి అధిక సంఖ్యలో దివ్యాంగ విద్యార్థులను తరలించి విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆర్మూర్లో నిర్వహించే శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ సబ్ కలెక్టర్ అభిజా:్ఞన్ మాల్వియాకు ఆహ్వాన పత్రికను అందజేసారు. ఆయన వెంట ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం ఉన్నారు.