calender_icon.png 21 November, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బడ్జెట్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

25-07-2024 04:21:14 PM

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ పై  కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క శాసనసభలో చదివింది బడ్జెట్టా..? అప్పుల పత్రమా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో బడ్జెట్ లో చూపలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములన్నీ అమ్మాలని అనుకుంటున్నారా..? అని ఆయన అడిగారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీలను అమలు కాంగ్రెస్ కు చేతకాదని ఈ బడ్జెట్ ను చూస్తే తెలుస్తోందన్నారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతే నిజమని బండి సంజయ్ తెలిపారు.