calender_icon.png 4 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు

01-09-2025 12:33:28 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం ఏజెన్సీ ప్రాంతాల్లో మసి వాగు, మున్నేరు వాగు, పాకాల వాగు, గుంజేడు వాగు, రాళ్ళ తెట్టేవాగు రోడ్లపై ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటకుండా పోలీసులు ఆయా వాగుల వద్ద రోడ్లపై భారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.

కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకూడదని, అవసరమైతే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అధికారులు, పోలీసులను అప్రమత్తం చేశారు. వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి ప్రజలకు తెలియజేయాలని, అత్యవసర పరిస్థితి ఏర్పడితే అన్ని విధాల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం వరకు 688.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.