16-01-2026 05:31:55 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఆరైవ్ ఆలైవ్ 10 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని ధర్మారెడ్డి గ్రామీణ వికాస్ బ్యాంకులో బ్యాంకు ఉద్యోగులకు మరియు బ్యాంకు ఖాతాదారులకు నాగిరెడ్డిపేట్ పోలీసువారు కుర్రోడు భద్రత సూచనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది బ్యాంకు ఉద్యోగులు మరియు ఖాతాదారులతో కలిసి ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తామని,రోడ్డుపై అతివేగంతో వాహనం నడపమని,మద్యం సేవించి వాహనం నడపమని అలాగే ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా నాగిరెడ్డిపేట్ పోలీస్ వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భార్గవ్ గౌడ్,పోలీస్ సిబ్బంది సురేష్ గౌడ్,రాజయ్య,శ్వేత,బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.