calender_icon.png 12 July, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

11-07-2025 11:16:35 PM

సిద్దిపేట రూరల్: ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా నారాయణరావు పేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్తు హైస్కూల్ నుండి గ్రామవిధుల గుండా ర్యాలీ తీయడం జరిగింది. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించి జనాభా పెరుగుదల వల్ల నష్టాలను సిబ్బంది వివరించడం జరిగింది. ప్రజలను చైతన్యపరిచి జనాభా పెరుగుట వలన కలిగే లాభనష్టాలను ప్రజలకూ వివరించాల్సిందిగా చెప్పడం జరిగింది. జనాభా దినోత్సవ థీమ్ ప్రణలిక బద్ధమైన తల్లీ తండ్రుల కోసం గర్భధారణ లా మధ్య ఆరోగ్యకరమైన సమయం అంతరం వుండాలి.