calender_icon.png 22 July, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిథి అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

22-07-2025 12:00:00 AM

నాగర్ కర్నూల్ జూలై 21 (విజయక్రాంతి): జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ డిగ్రీ & పీజీ (ఆరట్స్ అండ్ కామర్స్) శ్రీపురం రోడ్డు వద్ద గల ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటకంలో తెలిపారు.

ఇంగ్లీష్, తెలుగు మీడియంలో అర్థశాస్త్రము, వాణిజ్య శాస్త్రము కంప్యూటర్ అప్లికేషన్స్ , చరిత్ర రాజనీతి శాస్త్రం, ఉర్దూ మీడియం కొరకు అర్థశాస్త్రము రాజనీతి శాస్త్రము , ఉర్దూ సబ్జెక్టుల్లో బోధించేందుకు ఆసక్తి కలిగిన అతిధి అధ్యాపకులు పీజీలో 55% మార్కులతో ఉన్నవారు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

నెట్/సెట్/పిఎచ్ డి అర్హత గల వారికి ప్రాధాన్య త ఉంటుందని తెలిపారు. జూలై 22 (మంగళవారం) సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.