22-07-2025 12:46:16 AM
జగిత్యాల అర్బన్, జూలై 21 (విజయ క్రాంతి): జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య రాజేశం గౌడ్ తదితరులు కోరారు. క ళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు,కళాశాల వ్యవస్థాపకులు, తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్లో సోమవారం ఘనంగా నిర్వహించారు.
అమీర్ పేట్ లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశా ల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ,మాజీ మంత్రులు రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య, కళాశా ల భూదాత కాసుగంటి నారాయణ రావు మనుమడు, న్యాయవాది కాసుగంటి లక్ష్మణ్ కుమార్, శాతవాహన యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి,
తదితర ప్రముఖులతో పాటు ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆశోక్, పూర్వ విద్యార్థులు సిరిసిల్లశ్రీనివాస్, ఎస్పీసుబ్రహ్మణ్యం, సిహెచ్ వి.ప్రభాకర్ రావు తదితరులు పాల్గొని, కళాశాల వ్యవస్థాపకులు, తొలి ప్రిన్సిపాల్ కొండలరావు ను ఘనంగా సన్మానించి విద్యారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, జగిత్యాల డిగ్రీ కళాశాల ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ సంస్థను యూనివర్సిటీగా లేదా స్కిల్ ఇండియా సెంటర్గా అభివృద్ధి చేయాలని ప్ర భుత్వాన్ని కోరారు. కళాశాల పూర్వ విద్యార్థిగా కళాశాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్సీ ఎల్మ్రణఅన్నారు.