22-07-2025 12:45:21 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఈ నెల 24న ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. కులగణన, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అంశాల పై అదేరోజు సీఎం, డిప్యూటీ సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారని నాగర్‌కర్నూల్ ఎం పీ మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి 24న ఢిల్లీకి చేరుకుని కుల గణ న, రిజర్వేషన్ల అంశాలను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు వివరిం చి, వారి నుంచి సలహాలను, సూ చనలను తీసుకోనున్నారని పేర్కొన్నా రు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో చర్చించాలని కోరనున్నట్టు వెల్లడించారు. సోమవారం మల్లు రవి మీడియాతో మాట్లాడు తూ పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరపాలని పట్టుబడితే పదే పదే సభను వాయిదా వేస్తు న్నారన్నారు. వాస్తవాలు దేశ ప్రజల కు తెలియజేయాలని కోరామన్నా రు. దీనిపై ప్రధాని మోడీ ఎందుకు నోరు మెదరపని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లను అధిష్ఠానం పరిశీలిందన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే అధిష్ఠా నం దృష్టికి తీసుకెళ్లాలని, బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. సమావేశంలో ఎంపీలు రఘురాంరెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు.