calender_icon.png 9 September, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా భూములు లాక్కోవద్దు..అధికారులకు దళితుల మొర

01-09-2025 01:08:26 AM

వీర్నపల్లి,ఆగస్టు 31(విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం తమ భూములను ప్రభుత్వం తీసుకోవద్దని అధికారులను వేడుకున్నారు దాదాపు 70సంవత్సరాలనుండి అదే భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నామని మాకు అదే భూమిపై పట్టా పాస్ బుక్ ఉండని దానిపై లోన్ లు కూడా తీసుకున్నామని అన్నారు తమకి ఆ భూమి తప్పు వేరే భూమి లేదని ఆవేదన వ్యకం చేశారు,

నిన్న మండల రెవిన్యూ అధికారులు ప్రభుత్వ కార్యాలయం కోసం మీ భూమికి తీసుకుంటున్నాం అనడంతో షాక్ అయ్యమని అన్నారు ఆ భూమిలో నిరుపేద దళితకుటుంబలమైన మా భూములు తీసుకోవ్వాద్దని జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా కోరుకున్నారు.

ప్రభుత్వం ఈ భూములు తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డునా పడుతాయని మాకు చావే చరణ్యం అని అన్నారు కావున అధికారులు పునరాలోచన చెయ్యాలని జిల్లా కలెక్టర్ తమను న్యాయం చెయ్యాలని అన్నారు ఈ కార్యక్రమంలో మునిగే గంగవ్వ,యాస యాకోబ్,మునిగే పోచయ్య,మునిగే లచ్చవ్వ,మునిగే దేవవ్వ,మునిగే శంకర్,తదితరులుపాల్గొన్నారు.