01-09-2025 01:06:15 AM
ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించేలా మంత్రి చొరవ చూపాలనీ గ్రామస్థుల విజ్ఞప్తి
ధర్మపురి, ఆగస్టు31(విజయక్రాంతి):గత మూడు , నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సంగెపు భాగ్యలక్ష్మి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది . కడు పేదరికంలో నివసిస్తూ , రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బ తాకింది.
పైకప్పు కుప్పకూలిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎవరికి ప్రాణనష్టం జరగలేదు.ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కన్నీటిపర్యంతం అయ్యారు. స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ చూపి బాధితురాలుకి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించి ఆదుకోవాలనీ గ్రామస్థులు మంత్రి అడ్లూరికి విజ్ఞప్తిచేశారు.